గవర్నర్ మహిళ కాబట్టే అవమానిస్తున్నారంటూ.. బీజేపీ వ్యాఖ్యలు చేస్తోందని దీన్ని ఖండిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు మీరెందుకు గవర్నర్ కార్యాలయానికి కాషాయ రంగు పూస్తున్నారంటూ.. మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి గానీ, బండి సంజయ్ కి గానీ లేదని విమర్శించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ దేశంలోని తల్లులను అవమాన పరిచేలా మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను సమర్థించిన బండి సంజయ్ మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా.. ? అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్ గవర్నర్ కమలా బేనీ గారిని అత్యంత ఘోరంగా అవమానపరుస్తూ డిస్మిస్ చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని గవర్నర్ ను అడ్డు పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్న విషయం తెలియదా అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ‘భేటీ బచావ్, భేటీ పడావ్’ కార్యక్రమానికి 80 శాతం మోదీ ప్రచారానికి ఖర్చు పెడితే… 20 శాతం భేటీపైన ఖర్చు పెట్టారని ఆరోపించారు. బీజేపీ మహిళల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని హరీష్ రావు. గవర్నర్ తో మీకెం సంబంధం.. రాజ్ భవన్ కు కాషాయరంగు పూస్తున్నారు. ఏదైనా ఉంటే గవర్నర్ సీఎంగారితో, సచివాలయంతో మాట్లాడుతుందని ఆయన అన్నారు.
మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి, బండిసంజయ్ కి లేదు- హరీష్ రావు.
-