భీమ్లా నాయక్ సినిమా ఆశించిన విజయం సాధించలేదు అని మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్య చేయడంతో ప్రస్తుతం ఆయనను మరింతగా ఇరకాటంలో పెట్టేందుకు పవన్ అభిమానులు సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే సినిమా టికెట్ వ్యవహారానికి సంబంధించి రోజా మొదలుకుని నాని వరకూ అంతా మాట్లాడినవారే! దీంతో వివాదం పెరిగి జగన్ కు పెద్ద సమస్యగా పరిణమించడం ఖాయం. అనవసర తగాదాల కారణంగా వైసీపీ తన పరువు పోగొట్టుకుని తీరడం తథ్యం.
గత ఎన్నికల్లో పవన్ ఎవ్వరికీ సాయం చేయలేదు.అంటే అటు జగన్ కు కానీ ఇటు చంద్రబాబుకు కానీ..అయినప్పటికీ ఓ విధంగా పవన్ సాయం జగన్ అందుకున్నారు. పొత్తులు లేనప్పటికీ వైసీపీని అదే పనిగా విమర్శించినప్పటికీ కూడా జగన్ ను ఆదుకున్నారు పవన్.గత ఎన్నికల్లో జనసేనతో పొత్తులు లేని కారణంగా పూర్తిగా నష్టపోయింది టీడీపీ. అదే కనుక జరిగితే, ఆ తరహా వ్యూహాత్మక తప్పిదాలు అన్నవి చోటు చేసుకోకుండా ఉంటే టీడీపీ ఆశించిన విధంగా నెగ్గుకు వచ్చేది. ఎలా చూసుకున్నా కూడా 23 ఎమ్మెల్యే స్థానాలను మాత్రం కైవసం చేసుకోవడం అన్నది జరగని పనే అయ్యేది. అంతకుమించిన ఫలితాలు అందుకునేందుకు,నమోదు చేసేందుకు వీలుండేది.
కానీ ఆ రోజు ఉన్న పరిణామాల నేపథ్యంలో పవన్ మాత్రం కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఆ రోజు వైసీపీ మాట నెగ్గేందుకు ఆ పార్టీ ఎక్కువగా పవన్ పైనే దృష్టి సారించింది. ఆయన నిలబడ్డ స్థానాలలో లెక్కకు మించి ఖర్చు పెట్టింది అన్న జనసేన ఆరోపణలను ఈ రోజుకు కూడా సమర్థంగా తిప్పికొట్టలేకపోతోంది. ఈ క్రమంలో పాత కోపాలు అన్నీ దృష్టి ఉంచుకుని భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో వైసీపీ సర్కారు మరింత కఠినంగా వ్యవహరించింది. థియేటర్లపై అదే పనిగా దాడులు చేయించి మరీ! అధికార పార్టీ తన పంతం నెగ్గించుకునేందుకు చాలా దారులే వెతికింది.ఈ క్రమంలో పవన్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన వైసీపీకి, ఇప్పుడిక గడ్డుకాలమే! ఆవిధంగా వైసీపీ ఫట్.. పవన్ హిట్..అన్నది స్థిరం అయిపోనుంది.
ఈ నేపథ్యంలో / ఈ తరుణంలో ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా గురించి అంతటా చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప సినిమా పరంగా ఆయనను టార్గెట్ చేసి సాధించేదేమీ ఉండదని మెగా బ్రదర్ నాగబాబు చెబుతూనే ఉన్నారు. పవన్ కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్న మాట ఒకటి ఇప్పటికే పవన్ అభిమానుల మనోగతంగా స్థిరపడిపోయింది. అందుకే వాళ్లు కూడా అదే పనిగా వైసీపీ మంత్రులను ట్రోల్ చేస్తున్నారు. మీది టార్గెట్ మాది ట్రోల్ అన్న విధంగా సోషల్ మీడియాలో యుద్ధం నడుపుతున్నారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా ముందున్న కాలంలో కూడా అవన్నీ పరిగణనలోకి రాకుండానే కొన్ని విపత్కర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.