ఏపీకి కేంద్రం శుభవార్త.. వరద సాయం రూ.351 కోట్లు విడుదల

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత మూడు నెలల క్రితం ఏపీ వ్యాప్తంగా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరద ప్రభావానికి అతలాకుతలమైన ఏపీకి కేంద్ర ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం అందించింది. ఏపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి వరద నష్టానికి అనిపించింది కేంద్రం.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరద సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.351 కోట్లు విడుదల చేసింది కేంద్రప్రభుత్వం. అటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 112 కోట్లు, కర్ణాటక రాష్ట్రానికి 429 కోట్లు, మహారాష్ట్రకు 355 కోట్లు, పుదుచ్చేరికి 17 కోట్లు.. మొత్తం పదహారు వందల ఎనభై రెండు కోట్ల సహాయాన్ని రాష్ట్రాలకు అందించనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news