ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అలాగే మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ ములుగు జిల్లాలోని ఎర్రి గట్టమ్మ వద్ద ఆటో ను డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణీకులు అక్కడి కక్కడే మృతి చెందారు. అలాగే మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ స్థానికలు సమాచారం పోలీసులకు అందించారు.
దీంతో పోలసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయ పడ్డ వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అలాగే మృత దేహాలను కూడా పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కాగ ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు .. ములుగు జిల్లా లోని మంగ పేట మండలం కోమటి పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.