షుగర్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా.? తాగితే ఎంత పరిమాణంలో తాగాలి.? 

-

వేసవి కాలం వచ్చిందంటే..అందరూ ఇష్టంగా తాగేది కొబ్బిరనీళ్లు..ఎండనపడి వచ్చినవారికి చక్కగా కొబ్బరినీళ్లు ఇస్తే..హాయిగా ఉంటుంది. ఇక ఈ మూడు నెలలు కొబ్బరినీళ్లకు కూడా డిమాండ్ బానే ఉంటుంది. అయితే అందరూ ఇష్టంగా తాగే కొబ్బరినీళ్లు కొందరు తాగారు..అది వారికి ఇష్టంలేకనో..లేక వాళ్లకు ఉన్న అనారోగ్యపరిస్థితుల వల్లనో. షుగర్ పేషెంట్స్ అంటే..తీపి తినకూడదు..తియ్యగా ఉండేవి తాగకూడదు అంటుంటారు..ఈ క్రమంలో వారు తియ్యగా ఉండే కొబ్బరినీళ్లను కూడా తీసుకోరు. మనం ఈరోజు కొబ్బరినీల్లు షుగర్ పేషెంట్స్ తాగొచ్చా లేదా అనేది చూద్దాం.
పచ్చి కొబ్బరి నీళ్లు జీరో కేలరీలు ఉండే నాచురల్ వాటర్..దీంతో పాటు ఎలక్ట్రోలైట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి, ఫోలేట్ వంటి ఇతర పోషకాలు కూడా కొబ్బిరినీళ్లలో ఉంటాయి. కిడ్నీలో రాళ్లు తగ్గించడానికి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షించడానికి కొబ్బరినీళ్లు చక్కగా పనిచేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో కూడా కొబ్బరినీళ్లు సహాయకారిగా ఉంటాయి. అయితే ఈ నీళ్లు తియ్యగా ఉంటాయి కానీ.. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. కృత్రిమ స్వీటెనర్ ఉండదు. కాబట్టి ఇది శరీరంలోని చక్కెర స్థాయిని ప్రభావితం చేయదు. అంతేకాదు ఆరోగ్యానికి కొబ్బిరినీళ్లు చాలా మంచిది.
షుగర్‌ వ్యాధి ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా, తాగితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది..ప్రత్యేకంగా పరిశోధనలు ఏం చేయలేదు. కానీ కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి మొదలైనవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని వైద్యలు అంటున్నారు.
జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం..కొబ్బరి నీరు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. కానీ ఇది సహజంగా తీపి, ఫ్రక్టోజ్‌ను కలిగి ఉందని గుర్తుంచుకోవాలని తెలిపారు. కాబట్టి కొబ్బరి నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ పేషెంట్లు రోజూ 1 కప్పు (240 మి.లీ) కొబ్బరి నీళ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.
అయినా రోజు తాగడానికి అవి ఏం అందుబాటులో ఉండవు కదా..కాబట్టి ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు అరే..నాకు షుగర్ ఉందికదా..తాగితే ఎక్కువైపోతుందేమో అని భయం వదిలేసి..హ్యాపీగా తాగండి.. అయితే 240 మి.లీ కంటే ఎక్కువ వద్దే..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news