తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉంటే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారని, ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కంటే ఛత్తీస్‌ఘడ్‌లో మంచి పథకాలున్నాయని, రూ.2,500 మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని రేవంత్ పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే అని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోందని, చర్చకు కేటీఆర్ సిద్ధమా..? అని ప్రశ్నించారు.