మార్చి 26 వ తేదీ నుంచి ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టోర్నీకి కౌంట్ డౌన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ వేలంలో రూ.14 కోట్లు దక్కించుకున్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్.. తిరిగి మళ్లీ జట్టులోకి రానున్నారు.
వెస్టీండీస్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ కు గాయమైంది. దీంతో దీపక్ చాహర్ టీమిండియా దూరం కాగా.. ఐపీఎల్ 2022 టోర్నీకి కూడా దూరం అవుతాడని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జోరుగా సాగింది.
దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన కు గురయ్యారు. అయితే.. తాజాగా బీసీసీఐ కి చెందిన ఓ అధికారి దీపక్ చాహర్ ఫిట్ నెస్ పై అప్డేట్ ఇచ్చారు. దీపక్ చాహర్ గాయం నుంచి త్వరగానే కోలుకుంటున్నాడని.. త్వరలోనే చెన్నయ్ జట్టు లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చాహర్…. ఫిట్ నెస్ కోసం కసరత్తు చేస్తున్నాడు.