పంజాబ్ లో కాంగ్రెస్ కు షాక్.. సీఎం అభ్యర్థి చన్నీ రెండు చోట్ల వెనుకంజ

-

పంజాబ్ లో కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తోంది ఆప్. ఢిల్లీకే పరిమితమైన ఆప్ ప్రస్తుతం పంజాబ్ ను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. ఇప్పటికే ఆప్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేవలం 20 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీకి షాక్ ఇస్తున్నారు పంజాబ్ ఓటర్లు. పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. చన్నీ బదౌర్, చంకౌర్ సాహెబ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా వెనుకంజలో ఉండటం కాంగ్రెస్ కు షాక్ తగిలినట్లు అయింది. ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీప ప్రభావం చూపకుండా… చతికిల పడింది. సిద్దూ, చన్నీ వంటి కీలక నేతలు ఉన్నా కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news