నువ్వు సీతవు కాదే.. శుర్పణఖ.. ‘సీత’ టీజర్ మామూలుగా లేదు

-

ఏప్రిల్‌లో సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాలోని డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి.

డైరెక్టర్ తేజ.. రోటీన్‌కు భిన్నం. ఆయన సినిమాలు అన్ని సినిమాల్లా ఉండవు. కాస్త డిఫరెంట్. కొత్త నటులతో సినిమాలు తీసి హిట్ కొట్టిన చరిత్ర తేజాది. ఇప్పుడు కదా కానీ.. ఓ పది పదిహేనేళ్ల కింద తేజ డేట్ల కోసం స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవారట. ఆయన సత్తా అటువంటిది. తర్వాత ఆయన్ను ప్లాఫ్స్ పలకరించడంతో కొంచెం డీలా పడినా.. నేనే రాజు నేను మంత్రి సినిమాతో మళ్లీ పుంజుకున్నారు. ఆ సినిమా హిట్ అవడంతో మాంచి ఊపు మీద ఉన్నారు. అదే ఊపుతో ప్రస్తుతం సీత అనే సినిమా తీస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఇది.

Sai Srinivas Bellamkonda and Kajal Aggarwal sita teaser

ఏప్రిల్‌లో సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాలోని డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. మాటలు రాసింది పరుచూరి బ్రదర్స్. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ, కాజల్ కాంబోలో వస్తున్న రెండో మూవీ ఇది. కాజల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిందే తేజ. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మరి.. ఈ సినిమా కాజల్‌కు మంచి కెరీర్‌ను ఇస్తుందా? అంటే వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news