ఇటీవల విడుదల అయిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనాలను సృష్టిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ది కశ్మర్ ఫైల్స్ సినిమా గురించే చర్చనడుస్తుంది. ఎవరి నోట విన్నా.. ది కశ్మీర్ ఫైల్స్ అని వినిపిస్తుంది. 1990 లో జమ్మూ కశ్మీర్ పండిట్ల వలసలు, వారి పడ్డ ఇబ్బందుల గురించి చూపిస్తూ.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మర్ ఫైల్స్ ను తెరకెక్కించాడు. కాగ ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమా విడుదల అయిన సమయంలో తక్కువ థీయేటర్స్ లల్లో వచ్చింది.
కానీ సినీ ప్రేమికుల డిమాండ్ తో థీయేటర్ల సంఖ్యను పెంచారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయింపును ఇచ్చాయి. అలాగే తాజా గా మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒక్క రోజు సెలవును ప్రకటిస్తు.. ఆ రాష్ట్ర డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటానికి వీలుగా ఉండాలని పోలీసులకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు.. వారు కోరుకున్న రోజు సెలవు తీసుకోవచ్చని ఆ రాష్ట్ర డీజేపీ ప్రకటించారు.