చైనాలో కోవిడ్ కల్లోలం… రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు.. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్

-

ఓమిక్రాన్, డెల్టా వేరియంట్ల నుంచి బయటపడ్డ ప్రపంచానికి మరోసారి కరోనా కలవర పెడుతోంది. చైనాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. పాండిమిక్ ప్రారంభం అయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీ అవలంభించే చైనా కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన నిబంధనలు అనుసరిస్తోంది. 

చైనాలో కొత్తగా 5280 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి అధ్యధిక సంఖ్య, చైనాలో జిలిన్ ప్రావిన్స్ లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నమోదు అవుతున్న కరోనా కారణంగా.. 10 నగరాలు, కౌంటీల్లో లాక్ డౌన్ విధించారు. దక్షిణ చైనాలో పెద్ద నగరం.. టెక్ హబ్ షెన్ జెన్ లో కూడా లాక్ డౌన్ విధించారు. 17 మిలియన్ల జనాభా ఉన్న ఈ నగరంలో లాక్ డౌన్ విధించారు. కరోనా వ్యాపిస్తుండటంతో చైనా ప్రభుత్వం టెస్టులను పెంచుతోంది. మరోవైపు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని.. కరోనా అంతానికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

చైనాలో స్టెల్త్ ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. షాంఘై, చాంగ్ చున్, జిలిన్, యాంజి నగరాల్లో కూడా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news