NBK 107 : బాలయ్యను ఢీ కొట్టేందుకు వచ్చేసిన “ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి”

-

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టాడు నందమూరి బాలయ్య. అయితే.. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నందమూరి బాలయ్యను ఢీ కొట్టే.. విలన్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. బాలయ్యను ఢీ కొట్టేందుకు “ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి” వచ్చేసాడంటూ చిత్ర బృందం ఈ పోస్టర్‌ ను రివీల్‌ చేసింది. ఇక పోస్టర్‌ లో దునియా విజయ్‌.. పవర్‌ ఫుల్‌ గా ఉన్నారు. సిగరేట్‌ తాగుతూ.. బాలయ్యకు తగిన వాన్నే అన్నట్లు ఉంది దునియా విజయ్‌ లుక్‌.

Read more RELATED
Recommended to you

Latest news