కాంగ్రెస్‌ లో ముసలం..”ఇంటి-కాంగ్రెస్‌” వద్దంటూ అసమ్మతి నేతల సమావేశం

-

కాంగ్రెస్ అసమ్మతి నేతలు “డిన్నర్ సమావేశం” అయ్యారు. గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల “డిన్నర్ సమావేశం”. నిర్వహించారు. అజాద్ నివాసంలో “డిన్నర్ సమావేశానికి” కపిల్ సిబల్, శశి థరూర్, మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, రాజ్ బబ్బర్, పి.జే.కురియన్, మణిశంకర్ అయ్యర్ హాజరయ్యారు. అదనంగా తాజాగా “అసమ్మతి నేతల సమావేశానికి” శశి థరూర్, మణిశంకర్ అయ్యర్ హాజరు అయ్యారు.

జీవితం ఆసాంతం గాంధీ కుటుంబానికి అత్యంత పరమ విధేయుడు మణిశంకర్ అయ్యర్ కాగా, గాంధీ కుటుంబం విషయంలో శశి థరూర్ ఆచితూచి అడుగులు వేసే నాయకుడు. వీరిద్దరూ హాజరు కావడం ఆశ్చర్యకరంగా మారింది. అయుతే, సోమవారం కపిల్ సిబల్ చేసిన విమర్శలు చాలా మంది కాంగ్రెస్ నేతలకు అభ్యంతరకరంగా మారాయి.

“సమయం ఆసన్నం అయుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు నుంచి గాంధీ కుటుంబం పక్కకు తప్పుకోవాలి. వేరే వారికి బాధ్యత లు అప్పగించాలి” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కపిల్ సిబల్. “కొంత మంది “ఇంటి కాంగ్రెస్” కావాలంటున్నారు. నేను మాత్రం “అందరి కాంగ్రెస్” కావాలని కోరుకుంటున్నాను,” అని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను గురించి కపిల్ సిబల్ ను నిలదీసేందుకే వీరిరువురూ “డిన్నర్ సమావేశానికి” హాజరైనట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news