తెలంగాణలో మూడు రోజుల‌పాటు వర్షాలు : వాతావ‌ర‌ణ కేంద్రం

-

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయా మ‌ధ్య ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర, మ‌ర‌ఠ్వాడా మీదుగా ఉప‌రితల ద్రోని ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ ఉప‌రితల ద్రోని ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

కాగ గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు 42 డిగ్రీలకు పైగా న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో వర్షాలు రావ‌డంతో ఒక చ‌ల్ల‌టి వార్త అనే చెప్పాలి. కానీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అయితే ప్ర‌స్తుతం స‌మ‌యంలో వ‌రి ధాన్యం కొత‌కు వ‌చ్చింది. అలాగే మామిడి పంట కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం అయింది. కాగ ఈదురు గాలులు వీస్తే.. వ‌రి, మామిడి పంట‌ల‌తో పాటు మ‌రి కొన్ని పంట‌ల‌కు కూడా తీవ్ర న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news