వేసవి కాలం వచ్చేసింది.. చాలామందికి ఈ సీజన్ లో ఏది తినాలనిపించదు.. ముఖ్యంగా మసాల వంటకాలు అయితే అస్సలు ఇంట్రస్ట్ రాదు.. ఒకటే చెమట..చికాకు. బయటకు వెళ్లాల్సి వచ్చిందంటే..ఇక భానుడి వేడికి బలవ్వాల్సిందే.. ఈరోజు మనం వేసవిలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి అనేది చూద్దాం..
వేసివిలో వాటర్ ఎక్కువగా తాగాలి. మనం తాగిన వాటర్ లో సగం చెమట రూపంలోనే పోతుంది.. కాబట్టి బాడీని డీ హెడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఇంకా వాటర్ ఎక్కువ తాగాలనిపించే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాంటివి తిన్నారంటే.. కడుపంతా ఉక్కిరిబిక్కిరిగా అయిపోతుంది. ఉప్పు, పులుపు, మసాలాలు, నూనెలు ఉన్నవి తింటే.. ఎక్కువ వాటర్ తాగాలి.. అలా తాగినా.. పొట్ట పట్టదు. ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి తక్కువ ఉండేవి తినాలి. ఇక బయట లంచ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే.. మధ్యాహ్నం కంటే.. రాత్రి డిన్నర్ ప్లాన్ చేసుకోవడం మంచిది. అసలే ఎండ.. ఇక మీరు రెస్టారెంట్స్ అని, బయట ఫంక్షన్స్ అని వెళ్లి అక్కడ మసాల వంటలు లాగిస్తే.. బాడీ బాగా అలిసిపోతుంది. నైట్ టైంలో అయితే ఈ సమస్య కాస్త తక్కువగా ఉంటుంది.
వేసివిలో ముఖ్యంగా తినే పండ్లు..
వేసివిలో అన్ని పండ్లు తినొచ్చు.. అయితే కచ్చితంగా తినాల్సిన వాటిలో పుచ్చకాయ, ఖర్బూజం ఉంది. పుచ్చకాయ కంటే..ఖర్జూజానే ఎక్కువ లాభం ఇస్తుంది. కానీ చాలా మంది ఖర్జూజా వదిలేసి.. పుచ్చకాయను తింటారు. ఖర్జూజాలో మన శరీరానికి కావాల్సిన లవణాలు, ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వేసవిలో అన్నింటికంటే.. ఖర్జూజ తింటే.. చాలా మంచిది.
వేసివిలో కొబ్బరినీళ్లు తాగడం కరెక్టేనా..?
ఒక కొబ్బరిబోండాను ఒక సెలైన్ బాటిల్ తో పోల్చవచ్చు. బాడీ డీ హైడ్రేట్ అయి.. లవణాలు తగ్గినవారికి సెలైన్ పెడితే ఫ్రీ అయిపోతారు.. మనకు రోజుకు 300-400 మిల్లీ గ్రాముల సోడియం సరిపోతుంది. 100 గ్రాముల కొబ్బిరినీళ్లలో 105 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఒక కొబ్బరిబోండాంలో పావు లీటర్ ఉన్నా.. మనకు రోజుకు కావాల్సిన సోడియం వచ్చేస్తుంది. బయటనుంచి సాల్ట్ తీసుకోవాల్సి అవసరం ఉండదు. కుదిరితే.. డైలీ రెండు బోండాలు తాగితే ఈ కాలంలో చాలా మంచిది.
ఎండాకాలం పుల్కాలు తినటం మంచిదేనా..?
బరువు తగ్గాలని చాలామంది ఇప్పుడు వైట్ రాసి మానేసి మధ్యాహ్నం పుల్కాలు తినటం అలవాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు వేసివిలో అసలే మంట.. ఇప్పుడు ఈ పుల్కాలు తింటే., వేడి చేస్తుందేమో అని సందేహం అందిరిలో ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగినప్పుడు అసలు వేడి చేయదు. కానీ మీకు అయినా నాకు ఈ గోధుమపిండి ఎండాకాలం వేడి చేస్తుంది అని భయం ఉంటే.. పుల్కాలు మానేసి.. రాగి, జొన్న, సజ్జపిండి తీసుకుని పుల్లమజ్జిగా లేదా, పుల్ల పెరుగుతో కలిపి అట్టులాగా పోసుకుంటే.. మెత్తగా వస్తాయి. పుల్కాలు బదులు ఇవి తినొచ్చు. ఏ పిండి అనుకూలమో ఆ పిండి వాడుకోండి. లేదా అన్నీ తగుపాళ్లలో వేసుకున్నా సరి.
సమ్మర్ లో నైట్ నిద్రలో గొంతు బాగా ఎండిపోయి నట్లు అనిపిస్తుంది. నిద్రలో లేచి మరీ వాటర్ తాగాలి అనిపిస్తుంది. అలాంటి వారు.. డైలీ డిన్నర్ లో ఫ్రూట్స్ పెట్టుకుంటే మంచిది. మామిడికాయ, ముంజులు, బత్తాయి, ఖర్బూజ, పుచ్చకాయ లాంటి పండ్లతో నైట్ ఎర్లీ డిన్నర్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిది.. ఇవి వాటర్ కంటెంట్ కాబట్టి.. బాడీ డీ హెడ్రేట్ అవకుండా ఉంటుంది. నైట్ నిద్రలో గొంతు ఎండిపోయినట్లు ఉండే సమస్య కూడా రాదు.
ఈ జాగ్రత్తలు పాటిస్తూ.. హాట్ సమ్మర్ ను కూల్ గా గడిపేయండి మరీ.!
-Triveni Buskarowthu