డ్రై ఆప్రికాట్స్ తో ఆరోగ్యానికి బోలెడు లాభాలు.. సైంటిఫిక్ గా స్పష్టం చేసిన వాస్తవాలు..!

-

ఆరోగ్యానికి ఎండు విత్తనాలు మంచివి అని మనందరికీ తెలుసు.. డ్రై నట్స్ అంటే.. బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీరా, హెజల్ నట్స్ ఇలా కొన్ని మాత్రమే గుర్తుకువస్తాయి. కొనేశక్తి ఉండాలే కానీ.. ఆరోగ్యానికి మేలు చేసేవి బోలెడు ఉన్నాయి. అందులో డ్రైఆప్రికాట్(Dry Apricots). దీని గురించి ఎవరకీ పెద్దగా తెలిసి ఉండదు. ఇది కూడా ఇంట్లో పెట్టుకుని పిల్లలు, పెద్దలు, వృద్ధులు తీసుకుంటే.. చాలా లాభాలు ఉంటాయట. ఈరోజు మనం ఈ డ్రై ఆప్రికాట్ లో ఏం పోషకాలు ఉన్నాయి, ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దాం.

100 గ్రాముల డ్రై ఆప్రికాట్ లో ఉండే పోషకాలు

శక్తి 241 కాలరీలు
కార్భోహైడ్రేట్స్ 60 గ్రాములు
కొవ్వులు 0.5 గ్రాములు
ప్రోటీన్ 3.5 గ్రాములు
ఫైబర్ 7.6 గ్రాములు
బీటాకెరోటిన్ 2163 మిల్లీ గ్రాములు
‌‌విటమిన్ K 3.1 మైక్రోగ్రాములు
విటమిన్ E 4.3 మిల్లీ గ్రాములు
నియాసిన్( Niacin) 2.5 మిల్లీ గ్రాములు
పొటాషియం 1162 మిల్లీ గ్రాములు

ఇవన్నీ డ్రై ఆప్రికాట్ లో ఉండే స్థూల, సూక్ష్మపోషకాలు.. ఇంకా ఇందులో Catechins, Chlorogenic acid ఈ కాంపోజినషన్ వల్ల 50-70శాతం మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్మూలించడానికి ఇవి అద్భుతంగా పనికొస్తునాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. నూనెలో దేవినవి, బాగా మాడినవి, ఓవెన్ లో చేసేవి ఎక్కువ తినడం వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఇవి బాడీలో ఎక్కువ అయ్యాయి అంటే.. కాపాడాల్సిన రక్షణ వ్యవస్థే మన మీద ఎదురు దాడికి దిగుతుంది. తద్వారా దీర్ఘరోగాలకు, క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి. 2015వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంజిలియా ( University Of East Anglia- UK) వారు 2375 మంది మీద పరిశోధ చేసి.. డ్రై ఆప్రికాట్స్ ఫ్రీ రాడికల్స్ బాడీ నుంచి నిర్మూలిస్తున్నాయని కనుగొన్నారు.

ఇంకా ఇవి తినటం వల్ల మరో లాభం ఏంటంటే.. మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రస్( Oxidative Stress)ను తగ్గించడానికి ఇది 56శాతం పనికొస్తుందట.

2008లో మాన్స్టర్ యూనివర్శిటీ హాస్పటల్ ( Manchester University Hospital Germany) వారు డ్రై ఆప్రికాట్ మీద పరిశోధన చేసి.. మరో విషయం చెప్పారు. లివర్ సెల్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి, వాటి స్టామినాను పెంచడానికి అద్భుతంగా డ్రై ఆప్రికాట్స్ పనికొస్తున్నాయని కనుగొన్నారు. బాడీలో డీటాక్సిఫికేషన్ చేసేది, టాక్సిన్స్ ను రిమూవ్ చేసేది లివర్..అలాంటి లివర్ ఆరోగ్యానికి ఈ ఆప్రికాట్ పనికొస్తుంది.

పుల్లగా, తియ్యగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రష్ గా తినొచ్చు. ముసలివారు అయితే.. నానపెట్టుకుని తినొచ్చు. రక్షణ వ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి అందరూ వీటిని వీలైనప్పుడల్లా తినడానికి ప్రయత్నించమంటున్నారు..ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

అనీమియా రక్తహీనతతో బాధపడేవారికి..ఇది ఉత్తమ ఆహారం. డైలీ డైట్ లో చేర్చుకుంటే హీమోగ్లోబిన్ ఉత్పత్తికి ఎక్కువ సహాయపడి, రక్తహీనతను తొలగిస్తుంది .

మలబ్ధకం సమస్య ఉన్నవారికి కూడా డ్రై ఆప్రికాట్స్ చక్కగా పనిచేస్తాయి. జీర్ణక్రియను మెరుగు చేసి సుఖవిరోచనం అయ్యేలా చేస్తాయి.

డ్రైడ్ ఆప్రికాట్ జ్వరాన్ని సైతం తగ్గిస్తుంది. వీటిని జ్యూస్ గా తయారుచేసి తేనె మిక్స్ చేసి తీసుకుంటే చాలు.. అంతే కాదు ఇది దాహాన్ని కూడా తీర్చుతుంది.

ఇంకా ఇది స్కిన్ , కంటి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సంతానలోపాలను సైతం పరిష్కరించగల శక్తి డ్రై ఆప్రికాట్స్ కు ఉంది. పాలిచ్చే తల్లులు దీనిని డైలీ తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news