నా కళ్ల ముందు కేసీఆర్ ను తిట్టిన తలసాని, ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ ను పొగుడుతున్నారు: పవన్ కల్యాణ్

-

తెలంగాణ రాగానే దళితుడిని సీఎం చేస్తా అన్నారు. కానీ ఆ కోరికా నెరవేరలేదు. ఆ కోరిక ఎందుకు నెరవేరలేదు.. అనే ఆంశాలపై నేను ఇప్పుడు మాట్లాడను. కేసీఆర్ పాలన గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడను. ఎప్పుడూ మాట్లాడలేదు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం తేశారు. తెలంగాణలో మార్పు రావాలి. కేసీఆర్ కు ఇబ్బంది కలిగించాలని ఈ మాటలు చెప్పడం లేదు. టీఆర్ఎస్ అనేది చాలా పార్టీల మిశ్రమం. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు అందులో చేరారు. నా ముందు కేసీఆర్ ను తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్లు చాలామంది టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు వాళ్లు కేసీఆర్ ను పొగుడుతున్నారు. వీళ్లు ప్రజల కోసం చేసే వాలు కాదు. వాళ్ల కోసం వాల్లు పని చేసుకునేవాళ్లు. అదే వాళ్ల పద్దతి… అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో జరిగిన బహుజన జనసేన యుద్ధభేరిలో పవన్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan fires on errabelli and talasani

తెలంగాణలో ఎన్నికలు ఇప్పుడు జరిగి ఉంటే నేను ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, యువతకు అవకాశాలు ఇచ్చేవాడిని. వాళ్లకు జనసేన తరుపున పోటీ చేసే అవకాశం ఇచ్చేవాడిని. సరికొత్త తెలంగాణ రావాలంటే తలసాని లాంటి నాయకుల వల్ల కాదు. ఆవేశంతో కూడిన తెలంగాణ కాదు.. ఆలోచనతో కూడిన తెలంగాణ కావాలి. అది మీవల్లే సాధ్యం అవుతుంది.. అని పవన్ తెలిపారు.

దళితుడిని సీఎం చేస్తానన్నారు.. ఆ కోరికా నెరవేరలేదు..

తెలంగాణ రాగానే దళితుడిని సీఎం చేస్తా అన్నారు. కానీ ఆ కోరికా నెరవేరలేదు. ఆ కోరిక ఎందుకు నెరవేరలేదు.. అనే ఆంశాలపై నేను ఇప్పుడు మాట్లాడను. కేసీఆర్ పాలన గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడను. ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ.. ప్రతిపక్షం లేని రాష్ట్రం ఎలా? ప్రతిపక్షం అంటూ లేకుండా రాష్ట్రం ఉండాలి అని కోరుకుంటే ఎలా. మోదీకి కూడా ఎదురు ఉండకూడదు.. చంద్రబాబుకు కూడా ఎదురు ఉండొద్దు అంటే ఎలా? గట్టిగా మాట్లాడితే మేమే మీకు శత్రువులం కదా… అంటూ పవన్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news