వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన సంఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి లో రాత్రి 12 గంటల సమయంలో.. చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిన్న సాయంత్రం పూట మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ ను వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. చికిత్సకు సహకరించక తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని.. భర్త మృతితో రోడ్డున పడ్డామని మృతుడి భార్య జ్యోతి బోరున విలపిస్తోంది. కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే కొంత వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.