దారుణం: బాత్రూంలో టీచర్.. వీడియో తీసేందుకు విద్యార్థి యత్నం

-

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్ టీచర్ బాత్రూంలో ఉండగా ఓ పదో తరగతి విద్యార్థి వీడియో తీసేందుకు యత్నించాడు. విషయం పసిగట్టిని ఆమె అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఆ విద్యార్థికి గత ఐదేళ్లుగా ఆ టీచర్ హోం ట్యూషన్ చెబుతోంది. టీచర్ బాత్రూంలోకి వెళ్లినప్పుడు వీడియో తీయాలని సంకల్పించిన విద్యార్థి సబ్బుపెట్టెలో సెల్‌ఫోను అమర్చాడు. రోజూలాగే పాఠం చెప్పిన తర్వాత ఆమె బాత్రూంలోకి వెళ్లింది. అక్కడ కెమెరా ఆన్ చేసి ఉండటం గమనించిన టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news