పాకిస్తాన్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఈరోజు అవిశ్వాసం తీర్మాణంపై సమావేశం అయిన జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్ తోసిపుచ్చాడు. ఇది పాకిస్తాన్ పై విదేశీ కుట్ర అని తోసిపుచ్చడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఈనెల 25 వరకు సభను వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవికి రాజీనామా చేసే ఉద్ధేశం లేని ఇమ్రాన్ ఖాన్ పాక్ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రెసిడెంట్ ఆరీఫ్ అల్వీకి లేఖ రాశారు. దీంతో పాకిస్తాన్ లో మధ్యంతర ఎన్నికలకు తెరలేచే అవకాశం ఏర్పడింది. ఒక వేళ ప్రెసిడెంట్ అసెంబ్లీని రద్దు చేస్తే మధ్యంతర ఎన్నికలు తప్పవు. పాక్ లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రతీ పాకిస్తాన్ పౌరుడు అభినందిస్తున్నారని… అవిశ్వాసం విదేశీదారుల కుట్ర అని అన్నారు. తమను ఎవరు పాలించాలో పాకిస్తాన్ ప్రజలే నిర్ణయించుకోవాలని అని అన్నారు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.