మహిళల ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు మరోసారి నిలిచింది. మహిళ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు ఏడోసారి దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్ లో 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు… కేవలం రెండు వందల ఎనభై ఐదు పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో ఆస్ట్రేలియా జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించి… విశ్వవిజేతగా చరిత్ర సృష్టించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు… 50 ఓవర్లలో 5 వికట్లు కోల్పోయి.. ఏకంగా 356 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ హీలీ ఏకంగా 170 పరుగులు చేయగా… హైన్స్ 68 పరుగులు, మూనీ 62 పరుగులు చేసి.. జట్టుకు భారీ పరుగులు అందించారు. ఇక ఛేజింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 43.4 ఓవర్లకు 285 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో.. ఆసీస్ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది.
Australia beat England by 71 runs to win ICC Women's World Cup pic.twitter.com/183OnjOrOU
— ANI (@ANI) April 3, 2022