’ఆర్ఆర్ఆర్’ సినిమాలాగే ఇండియా ఎకానమీ రికార్డులు బద్ధలు కొట్టింది.: పీయూష్ గోయల్

-

‘ ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నోటి నుంచి కూడా ట్రిపుల్ ఆర్ మాట వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డ్ స్థాయిలో 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందని… ఆర్ఆర్ఆర్ సినిమా లాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రికార్డులను బద్దలు కొట్టిందని అన్నారు. భారతదేశంలోనే బహుశా ఆర్ఆర్ఆర్ సినిమా అతిపెద్ద సినిమా అని రూ. 750 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుసుకున్నా అని పీయూష్ గోయల్ అన్నారు. ఇలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా రికార్డుల మీద రికార్డులు కొడుతుందని నేను భావిస్తున్నానని పీయూష్ గోయల్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ ఏడాది ఇండియా టార్గెట్ పెట్టుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల మార్క్ ను మార్చి 23న అధిగమించామని ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఫార్మాసూటికల్స్ కీలక రంగాలు ఎగుమతుల పెరుగుదలకు తోడ్పడ్డాయని ఆయన అన్నారు. ఎగుమతుల్లో టాప్ 5లో US, UAE, చైనా, బంగ్లాదేశ్ మరియు నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news