మహేష్‌ బాబు “మహర్షి” నువ్వే సమస్తం.. సాంగ్‌ విడుద‌ల‌

-

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షి మే 9న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా నెలరోజులు ఉంది.. అప్పుడే మహర్షి టీం సినిమాను ప్రమోషన్‌ మొదలు పెట్టేసింది. ఇటీవలే ఉగాది సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపింది. కేవలం టీజర్ రిలీజైన 24 గంటల్లోనే 12.6 మిలియన్ వ్యూస్ తో మహర్షి దుమ్ముదులిపేశాడు. అయితే ఈ సినిమా నుండి ఒక్కో సింగిల్‌ని విడుదల చేస్తుంది మహర్షి చిత్ర యూనిట్‌.. అందులో బాగంగా ఈ రోజు షనువ్వే సమస్తంష అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాట హీరో ఎంట్రీ సాంగ్‌గా వస్తున్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మొత్తానికి మహేష్ నుండి మరో అద్భుతమైన సినిమా రాబోతుందని తెలుస్తుంది. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మొదటి సాంగ్ చోటి చోటి బాతె ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news