ఆమె గతంలో 2004, 2009 నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ కేబినేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ ఆమె పనిచేశారు.
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు ముగిశాయి. రెండో విడత కోసం ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇంతలోనే బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీర్థ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీలో బలమైన నేతగా ఉన్న కృష్ణ తీర్థ్ కాంగ్రెస్‌లో చేరడం బీజేపీ నష్టమేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆమె గతంలో 2004, 2009 నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ కేబినేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ ఆమె పనిచేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కృష్ణ బీజేపీలో చేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమ్ ఆద్మీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి ఆమె స్వస్తి చెప్పి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
Delhi: Former Union Minister Krishna Tirath quits BJP,rejoins Congress pic.twitter.com/zIrO0FuuMl
— ANI (@ANI) 12 April 2019