తెలంగాణలోని నియోజక వర్గ ఇంఛార్జిలకు పిసిసి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. నిన్నటి కార్యాచరణ పంపిన పిసిసి ధరల పెరుగుదలకు నిరసనగా, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో 12వ తేదీన నియోజక వర్గ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు లేఖలో రేవంత్ రెడ్డి వివరించారు.
12 వ తేదీన గవర్నర్ తమిళ సై తో టీపీసీసీ బృందం భేటీ ఉంటుందని.. గ్రామాలలో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను ఈ సందర్భంగా కోరానున్నట్లు స్పష్టం చేశారు.
15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల బృందాలు గ్రామాలలో పర్యటన ఉంటుందని.. పంటపొలాలు, కొనుగోలు కేంద్రాల పరిశీలన.. రైతులతో చర్చలు.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటన ఉందని.. వరంగల్ లో భారీ బహిరంగ సభ, హైదరాబాద్ లో నాయకులతో సమావేశాలు ఉంటాయని లేఖలో వివరించారు.