ఏపీ సీఎం జగన్ ఇటీవల చేసిన విమర్శలపై పవన్ కళ్యాన్ స్పందించారు. తన దైనశైలిలో జగన్ కు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాన్. నేను విధానాలపైనే మాట్లాడుతున్నా అని.. నన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారని.. మీరు సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుందని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జైల్ జీవితం గడిపి వచ్చారని… నాకు నీతులు చెప్పే స్థాయి వైఎస్సార్సీపీకి లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీని టీడీపీ బీ టీమ్ అంటే… మిమ్మల్ని చర్లపల్లి షటిల్ టీం అనాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇటీవల పలు సందర్భాల్లో సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాన్ లను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటున్నారని విమర్శించారు. రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఏప్పుడు కావాాలనుకుంటే అప్పుడు, ఏ పార్టీతో కావాలంటే ఆపార్టీతో జతకడుతారంటూ పవన్ కళ్యాన్‌ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శించారు. మన రాష్ట్రానికి ఓ దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య ఎల్లో మీడియా రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ… ప్రజల దీవెన ఉన్నంత కాలం వారు నా వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్.