ఆంధ్ర రాజకీయాల్లో తెలంగాణ ఆడబిడ్డ..మంత్రిగా ట్రెండ్ సెట్టర్..!

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే సారి ఏకంగా.. 25 మంది మంత్రులు రాజీనామా చేయడంతో.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. కొత్త కేబినేట్‌ ను ఏర్పాటు చేసారు. ఎన్నో కూడికలు, తీసివేతలు, అసంతృప్తుల మధ్య … ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌ ఏర్పాటు అయింది. అయితే.. ఈ కొత్త కేబినేట్‌ లో అనూహ్యంగా ఊహించని వ్యక్తలకు.. ఛాన్స్‌ వచ్చింది.

ఇందులో ఒకరే చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజినీ. టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరిన విడదల రజినీ… 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఇక అదృష్టం కలిసిరావడంతో… జగన్‌ కేబినేట్‌ లో వైద్య శాఖ మంత్రి గా ఛాన్స్‌ కొట్టేశారు విడదల రజినీ. అయితే.. వైద్య శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రజినీ.. తెలంగాణ బిడ్డే.

యాదాద్రి భువన గిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య కూతురు రజినీ మంత్రి కావడంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తయ్య బతుకు దెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌ కు వలస వెళ్లారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజిని ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రిగా కూడా ఛాన్స్‌ కొట్టేశారు.

Read more RELATED
Recommended to you

Latest news