తెలంగాణ లో కంటే ఏపీలో ఆర్టీసీ చార్జీలు తక్కువే – రవాణా శాఖ మంత్రి

-

ఆంధ్రప్రదేశ్ లో కొందరు పాత మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త మంత్రివర్గ విస్తరణ చేసిన విషయం తెలిసిందే.అయితే రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపే విశ్వరూప్ అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు.కాకినాడ జిల్లాఅన్నవరం దేవస్థానంలో శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించిన ఎ.పి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ దంపతులు.మంత్రి దంపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు అధికారులు, అర్చకులు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి పినిపే విశ్వరూప్ …మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావడం బాధాకరం అన్నారు.

ఆర్టిసీని కాపాడుకోవడానికే ఛార్జీలు పెంచాల్సి వచ్చింది అని తెలియజేశారు మంత్రి పినిపే విశ్వరూప్. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు.రెండేళ్ల క్రితమే తెలంగాణ ఆర్టిసీ డీజిల్ పై సెస్ విధించింది అని గుర్తు చేశారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఎ.పి.లో ఆర్టిసీ ప్రభుత్వంలో విలీనమైంది అని అన్నారు ఎ.పి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ .

Read more RELATED
Recommended to you

Latest news