హీరో ప్రభాస్ కు ట్రాఫిక్ పోలీసుల షాక్…. కార్ కు ఫైన్

-

హైదరాబాద్ సిటీ ట్రాాఫిక్ పోలీసులు తగ్గదే లేదు అంటున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే సామాన్యులైనా.. సెలబ్రెటీలు అయినా ఒకటే అని అంటున్నారు. నిబంధనులు ఉల్లంఘించిన సెలబ్రెటీలకు ఫైన్లు వేస్తున్నారు. తాజాగా హీరో ప్రభాస్ కారుకు ఫైన్ విధించారు పోలీసులు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బ్లాక్ ఫిల్మ్ తో వస్తున్న కారును గుర్తించారు. దీనికి తోడు నంబర్ ప్లేట్ కూడా సరిగా లేదకపోవడంతో.. కారుకు ఫైన్ వేశారు. పోలీసులు విచారించగా కారు హీరో ప్రభాస్ ది అని తేలింది. కార్ పై ఉన్న ఎంపీ స్టిక్కర్ తో పాటు అద్దాలకు బ్లాక్ ఫిలింను తొలగించి రూ. 1450 ఫైన్ విధించారు. కార్ కు ఫైన్ విధించే  సమయంలో కారులో ప్రభాస్ లేరు. ఆయన డ్రైవర్ కు జరిమానాకు సంబంధించిన రిసిప్ట్ అందించారు. 

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో కార్లకు, బైక్ లకు ఉన్న స్టిక్కర్లను, బ్లాక్ ఫిల్మ్ లను తొలగిస్తున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల పలువురు సెలబ్రెటీల కార్లకు కూడా ఫైన్లు వేశారు పోలీసులు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, త్రివిక్రమ్, కల్యాణ్ రామ్ మంచు మనోజ్ కార్లకు ఫైన్లు వేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news