ఇంట్లో నుండి దోమలు పోవాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

-

దోమలు కుట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. పైగా ఇంట్లో ఎక్కువ దోమలు ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే దోమల బారి నుండి బయట పడడం చాలా ముఖ్యం. దోమలు కుడితే పిల్లలకి కూడా ఇబ్బందే.

 

వేసవి కాలంలో కూడా దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయి. కనుక కుట్టకుండా చూసుకోవాలి లేదంటే డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. అయితే దోమల బారి నుంచి బయట ఎలా పడాలి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ కోసం చూసేద్దాం.

ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో కర్పూరం నూనె వేసుకుని దానిని బిర్యానీ ఆకులు మీద వేసి కాల్చాలి. అయితే ఈ పొగ వేయడం వల్ల దోమలు పోతాయి. కాబట్టి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవండి.

వేప నూనె వేసి దీపం వెలిగించి కర్పూరం కూడా వేస్తే దోమలు పోతాయి. ఒకవేళ దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ టిప్ ని కూడా మీరు ఫాలో అవ్వొచ్చు.

అదే విధంగా కొబ్బరి నూనె, వేప నూనె, లవంగాల నూనె, పిప్పర్మెంట్ నూనె, యూకలిప్టస్ నూనె అన్నిటిని సరైన మోతాదులో తీసుకుని ఒక బాటిల్ లో వేసి రాత్రి నిద్ర పోయేటప్పుడు చర్మానికి ఆ నూనెను అప్లై చేసుకుంటే దోమలు కుట్టవు. కనుక ఒకవేళ కనుక దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా అనుసరించండి దీనితో వాటి నుంచి బయట పడవచ్చు. అలానే దోమలు లేకుండా చూసుకుంటే ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు కూడా వ్యాపించకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news