ఏపీ ప్రజలకు తీరనున్న కరెంట్ కష్టాలు.. అందుబాటులోకి 1600 మెగావాట్ల విద్యుత్

-

విద్యుత్ శాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష విద్యుత్ పరిస్థితి.. అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలపై చర్చించారు. అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటిపిఎస్సులల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచనలు చేశారు. హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారుల వెల్లడించారు.

మే ఒకటి నుంచి సాధారణ స్థాయికి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు అధికారులు.రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు.. 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు జెన్కో అధికారులు.

30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్టు వెల్లడిo చారు. వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా విషయంలో అండగా ఉంటామన్నరు పెద్దిరెడ్డి. దేశం మొత్తం విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది…రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ లోనూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని…వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకున్నాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news