నాకు ఇప్పటికీ సొంతిళ్లు లేదు…. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గత ఆర్నేళ్లుగా ప్రపంచ కుబేరుడిగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. పేపాల్ తో ప్రారంభమైన మస్క్ వ్యాపార సామ్రాజ్యం టెస్లా, స్పేస్ ఎక్స్ లతో ఆకాశానికి చేరింది. టెస్లా కార్ల తయారీతో ఎలాన్ మస్క్ దశ తిరిగింది. మరోవైపు స్పేస్ ఎక్స్ ను స్థాపించి విజయవంతంగా రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాడు. త్వరలో మార్స్ పైకి మానవుడిని పంపాలనే కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు ఎలాన్ మస్క్. తాజాగా ట్విట్టర్ ను కూడా కొనేందుకు సిద్ధం అయ్యాడు మస్క్. 43 బిలియన్ డాలర్ల తో భారీ ఆఫర్ ఇచ్చాడు.

ఇంతటి శ్రీమంతుడికి సొంతిళ్లు లేదంటే ఎవరైనా నమ్ముతారా… ? అయితే తనకు సొంతిళ్లు లేదని… ఎక్కువగా ప్రెండ్స్ ఇళ్లలోనే ఉంటా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెడ్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఖరీదైన వాటిలో ప్లేన్ ఒకటే అని ఆయన అన్నారు. అది ఉంటేనే వేగంగా ప్రయాణించడం సాధ్యం అవుతుందని… పని వేగం పెరుగుతుందని చెప్పుకొచ్చాడు మస్క్. తను సంపాదించే డబ్బును ఎక్కువగా తన ప్రాజెక్ట్ ల కోసమే ఖర్చు చేస్తా అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news