బీరకాయ బోర్ కొడుతుందా..? అయితే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ కమ్ హెల్తీ..!

-

బీరకాయ అంటే చాలామందికి పెద్దగా ఇష్టం ఉండదు. కొనాలన్నా వీటితో పెద్ద పంచాయితీ..ఎంత జాగ్రత్తగా చూసుకుని తెచ్చినా ముదిరిపోతాయి అని వీటిమీద అసలు ఇంట్రస్ట్ ఉండదు. పత్యం కూరలానే దీన్ని ఫీల్ అవుతారు. ఆరోగ్యం బాలేనప్పుడు తినాల్సిన కూరల్లో ఇది పెట్టుకుంటారు. కానీ బీరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని టేస్టీగా వండుకుంటే.. వారానికి ఒకసారి అయినా తినొచ్చు. ఇంకెందులో ఆలస్యం బీరకాయ పోస్తో కర్రీ ఎలా చేయాలో చూద్దామా..!

బీరకాయ పోస్తో కర్రీకి కావాల్సిన పదార్థాలు..

బీరకాయ ముక్కలు ఒకటిన్నర కప్పు
టమోటా పేస్ట్ ఒక కప్పు
గసగసాలు అరకప్పు
పెరుగు అరకప్పు
పచ్చమిర్చి నాలుగు
నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
సోంపు ఒక టీ స్పూన్
నల్ల జీలకర్ర ఒక టీ స్పూన్
మెంతులు ఒక టీ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు రెండు

పసుపు కొద్దిగా

తయారు చేసే విధానం

ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని పొయ్యు మీద పెట్టి గసగసాలు వేసి దోరగా వేపించండి. అవి వేగిన తర్వాత.. ఒక బౌల్లో తీసుకుని నీళ్లు పోసి 20నిమిషాలు నానపెట్టండి. ఆ తర్వాత నీళ్లను వడగట్టి.. మిక్సీజార్ లో గసగసాలు వేసి.. అందులో గట్టి పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. పొయ్యుమీద కళాయి పెట్టి.. మెంతులు, ఆవాలు, సోంపు, జీలకర్ర, నల్లజీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మీగడ , పసుపు వేసి వేగనివ్వండి. తాలింపు పూర్తిగా వేగినతర్వాత.. బీరకాయ ముక్కలు వేసుకుని నాలుగు నిమిషాలు వేగనివ్వండి. అప్పుడు అందులోంచి నీరు బయటకు వచ్చి మెత్తపడుతుంది. అందులో టమోటా పేస్ట్, ముందు పెరుగువేసి గ్రైండ్ చేసిన గసగసాల పేస్ట్ వేసి తిప్పండి. మూతపెట్టి పదినిమిషాలు ఉంచుకుని.. ఆ తర్వాత నిమ్మరసం వేసుకుంటే.. ఉప్పులేని లోటు తెలియదు. ఫైనల్ గా.. కొత్తిమీర వేసుకుకని తీసేయడమే.. ఇది నైట్ తీసుకుంటే.. మంచిగా నిద్రపడుతుందట. ఇంకా ఇది రోటీ, పుల్కాల్లోకి సూపర్ గా ఉంటుంది. కాబట్టి.. తప్పకుండా ట్రై చేయండి మరీ..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news