నిరుద్యోగులకు కేసీఆర్‌ శుభవార్త…త్వరలోనే 13వేల టీచర్ ఉద్యోగాల భర్తీ

-

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. త్వరలోనే 13వేల టీచర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది సర్కార్‌. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్ నీ ప్రారంభించి,అనంతరం అంబెడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ……మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలన్నారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలని… అంబేద్కర్ ఇచిన్న స్ఫూర్తినీ తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని వెల్లడించారు.

పేదరికం వల్లనే మనుషుల్లో తేడా వచ్చిందని… పేదరికాన్ని రూపు మపాలని కెసిఆర్ దళిత బంధు పథకం తెచ్చాడన్నారు. విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్ లలో కూడా రిజర్వేషన్ తెచ్చామని వివరించారు. విద్యలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా అందించేందుకు 7300కోట్ల తో మన ఊరు మన బడి పథకం తెచ్చామని.. 13వేల టీచర్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news