Yash: రాఖీభాయ్‌ కల నెరవేరేనా..ఆ హీరోయిన్‌తో నటించాలని ఉందన్న KGF హీరో

-

KGF చాప్టర్ 2 మూవీని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇక ఈ చిత్రం చాప్టర్ 1 విడుదలైన నాటి నుంచి చాప్టర్ 2 ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేసిన సినీ లవర్స్ ఇప్పుడు హ్యాపీగా థియేటర్స్ లో పిక్చర్ చూసేస్తున్నారు. ఇక ఈ సినిమా చాప్టర్ 1తోనే శాండల్ వుడ్ హీరో యశ్..రాకింగ్ స్టార్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

దేశవ్యాప్తంగా యశ్ కు అభిమానులు ఏర్పడ్డారు. కేజీఎఫ్ సినిమాలో రాఖీ భాయ్ గా యశ్ యాక్టింగ్ కు జనాలు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎగబడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1, 2లతో యశ్…కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా కోసం ఏళ్ల సమయం కేటాయించిన యశ్..ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే KGF2 సక్సె్స్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ గురించి చెప్పాడు యశ్. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ తో యాక్ట్ చేయాలని అడగగా, దీపికా పదుకునే పేరు చెప్పాడు కేజీఎఫ్ హీరో.

చూడాలి మరి..భవిష్యత్తులో వీరిరువురు జంటగా వెండితెరపైన కనబడుతారో లేదో.. దీపికా పదుకునే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ తో పాటు షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తన భర్త రణ్ వీర్ సింగ్ ‘83’లో కథానాయికగా నటించింది దీపు.

 

Read more RELATED
Recommended to you

Latest news