ధాన్యం కొనుగోళ్ల గురించి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని… రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాలం ఆడుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వంద కేజీల ధాన్యానికి 60 కేజీల బియ్యం, 15 కేజీల నూకలతో కూడిన బియ్యాన్ని ఎఫ్సీఐ అనుమతిస్తుందని…యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా…. నెల రోజుల ముందు పంటలు రైతులతో పంట వేయించిన నూకల శాతం కూడా తగ్గేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదని… రైతులు, కేంద్ర ప్రభుత్వంపై పెత్తనం చేసేలా తెలంగాణ సర్కార్ వ్యవహరించిందని విమర్శించారు. గత రబీ సీజన్, ఖరీఫ్ కు సంబంధించి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదని..ఆరుసార్లు గడువు పెంచినా.. ఇవ్వలేదని కిషన్ రెడ్డి తెలిపారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం తీసుకోవాలని లేఖ రాసిందని… కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు వరకు కూడా కనీసం గోనె సంచులను కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదని విమర్శించారు. తూకం వేసే కాంటాలు లేవని, వర్షం వస్తే టార్పలిన్లు కూడా ఒక్క మార్కెట్ యార్డ్ లో కూడా లేవని విమర్శించారు.
రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాలం ఆడుతోంది: కిషన్ రెడ్డి
-