నెల్లూరు రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. పక్కా డిఫరెంట్ అంటే ఏంటో నిరూపించాకే మాట్లాడతాయి. మీడియా ముందు కన్నా వెనుక జరిగే తతంగం హాయిగా నాలుగు మాటలు ఎక్కువ రాసుకునే విధంగానే ఉంటాయి. కానీ వాటి గురించి గౌరవ లీడర్లను అడిగితే టన్నుల కొద్దీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని పాపం గ్రాముల్లో ఆన్సర్ ఇచ్చి పక్కకు తొలగి పోతుంటారు లేదా నవ్వి పోతుంటారు.
ఆ విధంగా కొన్ని సార్లు నెల్లూరు రాజకీయాలు ఆసక్తి తో పాటు విరక్తి ని కూడా పుట్టిస్తాయి. ఏం చేసినా కూడా వాళ్లకే చెల్లులెండి. ఇప్పుడు నెల్లూరు రాజకీయంలో మరో మార్పు రానుంది. అదేలేండి అనిల్ కుమార్ యాదవ్ (మాజీ మంత్రి) కి బదులుగా మరో నేత తెరపైకి వచ్చి మాట్లాడతా ఉన్నారు. ఆ విధంగా ఆయన ముందుకు పోతా ఉన్నారు. హా అవును! ఇప్పుడిక జరగనున్నది ఇదే !
అనిల్ కానీ కాకాణి కానీ వేర్వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం ఒక సంచలనాత్మక ప్రకటన అని రాయాలి. ఎందుకంటే ఆ ఇద్దరూ వేర్వేరు కాదు అని మీడియా గుర్తించడం లేదు కానీ వాళ్లెప్పుడూ తామిద్దరం ఒక్కటే అనుకునే విధంగానే ఉన్నారు అని కూడా అనుకోవాలి. ఆవిధంగానో ఏ విధంగా నెల్లూరు పాలిటిక్స్ విభిన్నంగా అర్థం అయి ఉంటాయి. లేదా విభిన్నతలను ఆపాదించుకుని ఉంటాయి.
మంత్రి పదవి పోయాక అనిల్ లో వైరాగ్యం కనిపిస్తోంది. లేదా పైకి కనిపించని అసహనం కూడా లోపల దాగి ఉంది. కనుక ఆయన ఎప్పటిలానే మేమిద్దరం ఒక్కటే అన్న మాట చెప్పలేకపోతున్నారు. కానీ కాకాణి మాత్రం మేమిద్దరం ఒక్కటే అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అనిల్ తన కుటుంబంలో ఓ సభ్యుడు అని కూడా అంటున్నారు. ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు కూడా !