ఈనెల 28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం: సీఎం జగన్

-

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.స్పందన లో భాగంగా ఈనెల 28న అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం అందించాలని నిర్ణయించారు.అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలియజేశారు.కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. వీలుకాని సమక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలన్నారు.అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలాన్ని అందించాలని అధికారులకు సూచించారు.

దీనికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు.ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నాం అన్నారు.అదే రోజున 1.79 లక్షల పి ఎం ఏ వై , వైయస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్.ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులను సత్కరిస్తామని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news