విద్యార్థులకు అలర్ట్ : యూజీసీ నెట్ 2022 నోటిఫికేషన్ విడుదల

-

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) UGC NET అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021డిసెంబర్‌, 2022 జూన్‌ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్‌ను జారీచేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌కు సంబంధించి అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఆయా తేదీలను త్వరలోనే తన వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. UGC NET 2022 లో మంచి స్కోర్‌ సాధిస్తే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (Junior Research Fellowship), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (Assistant Professor) పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది.

UGC-NET Exam 2021: 5 points candidates should keep in mind

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జేఆర్‌ఎఫ్‌కు ప్రతి ఏడాది రెండు సార్లు ఈ యూజీసీ నెట్‌ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల ఒకట్రెండు పర్యాయాలు ఆలస్యంగా నిర్వహించారు. తద్వారా డిసెంబర్ 2021, జూన్ 2022 ఎంట్రన్స్‌ను కలిపి ఒకేసారి నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ (UGC NET 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది.

UGC NET 2022 పరీక్ష ఫీజు వివరాలు ఇలా:
జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.1,100
జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్తులు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ రూ. 550
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఫీజు రూ.275

 

Read more RELATED
Recommended to you

Latest news