మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే కు షాక్ తగిలింది.14 ఏళ్ల క్రితం నాటి ఓ కేసుకు సంబంధించి ఆయనను సంగ్లీ జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్ 109, 117 సెక్షన్ల కింద 2008లో కేసులు నమోదయ్యాయి.రాజ్ ఠాక్రేను కు అరెస్ట్ చేసి తమ ముందు హాజరు పరచాలని ముంబై పోలీస్ కమిషనర్ కు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
ఆయనతో పాటుఆయనతోపాటు ఎంఎన్ఎస్ నేత శిరీష్ పార్కర్ కు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు పంపింది.ఇరువురు నేతలను జూన్ 8 లోగా తమ ఎదుట హాజరు పరచాలని కమిషనర్ ను కోర్టు ఆదేశించింది.ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సింగ్లా లోని శీరాలలో 2008లో ఠాక్రే నిరసనలకు దిగారు.ఆ సమయంలో హింసను ప్రేరేపించే విధంగా ప్రసంగాలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.తాజాగా ఈ కేసులో ఆయనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.