ఎడిట్ నోట్ : బూతులు మాట్లాడ‌కండి మ‌హేశ్ !

-

సినిమా అంటే ఎన్నో విశేషాల‌కు రూపం. సినిమా అంటే ఎన్నో ఆనందాల దుఃఖాల స‌మ్మిళితం. అదేవిధంగా సినిమా తోనే జీవితం మారిపోయిన దాఖ‌లాలు లేవు కానీ సినిమా కార‌ణంగా ప్ర‌భావితం అయిన వ్య‌క్తులు ఉన్నారు. వారికి సంబంధించిన క‌థ‌లు ఉన్నాయి. అందుకు త‌గ్గ ఉదాహర‌ణ‌లు కూడా ఉన్నాయి. అందుకే ఓ సినిమా స్థాయిని పెంచేది అందులో ఉప‌యోగించే భాష‌, ప‌లికే సంభాష‌ణ, సంస్కృతిని ప్ర‌తిబింబించిన తీరు ఇవన్నీ ప్ర‌ధాన విష‌యాలు. ముఖ్య ల‌క్ష‌ణాలు. కానీ ఇప్పుడు సినిమా స్టైల్ మారింది. ట్రెండు మారింది. బుల్లి తెర‌పై ఎన్ని బూతులు విన‌బ‌డుతున్నాయో అదే విధంగా సినిమాల్లో కూడా బూతులు బీప్ సౌండ్లు లేకుండానే వినిపిస్తున్నాయి. ఆ కార‌ణంగా ఎంద‌రినో ఓ సినిమా చెడు ప్ర‌భావ‌మే చూపిస్తోంది. బాధ్య‌త గ‌ల న‌టులు ఓ సారి ఆలోచిస్తే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వ‌స్తుంది.

ఓ సినిమా మాట్లాడుతుంది. వినండి. ఓ సినిమా ర‌హ‌స్యాల‌ను ఛేదిస్తుంది. చూడండి. ఓ సినిమా బాధ్య‌త త‌ప్పి ఉందా? త‌ప్ప‌క ప్ర‌శ్నించండి. ఆ విధంగా గ‌త చిత్రాల‌తో పోలిస్తే మ‌హేశ్ ఇంకా బెట‌ర్ అయ్యారు. గ‌తంలో క‌న్నా విభిన్నంగా ఉండే క‌థల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. మూస ధోర‌ణిలో ఆయ‌న సినిమాలు ఇవాళ ఉండ‌డం లేదు. అయితే పోకిరీ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు ఆయ‌న కాస్త శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ఆ కోవ‌లో ఆ తోవ‌లో ఆయ‌న స‌ర్కారు వారి పాట సినిమా చేశారా ? అవున‌నే విధంగానే ఉంది ఆ సినిమా ట్రైల‌ర్. ప‌ర‌శు రాం అనే ప్ర‌తిభావంతుడు రాసిన క‌థ ఇది. తీసిన సినిమా ఇది. పూరీ జ‌గ‌న్నాథ్ శిష్యుడిగా పేరున్న ఆయ‌న ఇప్పుడు మ‌రో మంచి సినిమాతో తెర‌పై అద్భుతం చేయించేందుకు మ‌హేశ్ ను వాడుకుంటున్నారు. ఆయ‌న‌కు జోడీగా మ‌హాన‌టి ఫేం కీర్తి సురేశ్ న‌టించారు.

బూతులు మాట్లాడ‌కండి మ‌హేశ్ .. మీరు బాధ్య‌త ఉన్న క‌థానాయ‌కుడు.. మీరే క‌దా బాధ్య‌త ఉండ‌క్క‌ర్లా అంటూ ఓ డైలాగ్ చెప్పారు. అలాంటి మీరెలా బూతులు మాట్లాడ‌తారు. మాట్లాడి ఎలా మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకుంటారు..చెప్పండి. ఏదేమ‌యినప్ప‌టికీ మీరు బూతులు మాట్లాడ‌డం త‌ప్పు ! స‌న్నివేశం ఎలా ఉన్నా కూడా మీరు బూతులు మాట్లాడ‌కూడ‌దు.

సంద‌ర్భం : స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ చూశాక

Read more RELATED
Recommended to you

Latest news