వేలల్లో ఒక్కరు రాజ‘శేఖర్’..ట్రైలర్‌లో మాటల్లేవ్..ఓన్లీ యాక్షన్

-

యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ నటించిన చిత్రం ‘శేఖర్’. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇకపోతే ఈ ట్రైలర్ లో హీరో రాజశేఖర్ కు డైలాగ్స్ ఉండకపోవడం గమనార్హం. రాజశేఖర్ కు ట్రైలర్ లో ఒకటి , రెండు చిన్న వన్ లైనర్స్ తప్ప పెద్దగా ఏం లేవు.

జీవితా రాజశేఖర్ ఈ పిక్చర్ కు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో రాజశేఖర్ కూతురు శివాని కీలక పాత్ర పోషించింది. మాలీవుడ్(మలయాళ)సూపర్ హిట్ ఫిల్మ్ ‘‘జోసెఫ్’’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా ఈ పిక్చర్ తెరకెక్కింది.

Rajashekar shekar first glimps
Rajashekar shekar first glimps

అరుకు సమీపంలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తిగా రాజశేఖర్ లుక్ అదిరిపోయింది. పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేసినప్పటికీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే వ్యక్తిగా రాజశేఖర్ కనిపించారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఇందులో కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఉండటం. రాజశేఖర్‌కు ఇది 91వ సినిమా కాగా, ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ లాయర్ గా కనిపించారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news