తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా కంపెనీల ప్రారంభించడానికి కొంత ఆలస్యం జరిగింది… రాబోయే 18 నెలల్లో 20 వేల ఉద్యోగాలు వచ్చే కంపెనీలు అందుబాటు లోకి వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి ఏడాది పూర్తి చేసుకుంది. ఆ వేడుకలకు హాజరవుతున్నాను..వరంగల్ లో ఉన్న వసతులతో కొత్త కంపెనీ వరంగల్ కి వస్తున్నాయన్నారు.
ఐటీ లో కంపెనీల హైదరాబాద్ తరువాత వరంగల్ కి ప్రాధాన్యత ఇస్తున్నారని… సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్నారు. పల్లెలు పట్టణాలు అన్ని టిని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రగతి పథంలో లో దూసుకుపోతుంది. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రక్కరం. స్థూల ఉత్పత్తి 150 శాతం పెరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో ఉన్నారో నాకు తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.