వరంగల్ లో డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ ఏ పదవిలో వచ్చాడో మాకు తెలియదని… రాహుల్ గాంధీ ఎంపీనా, అధ్యక్షుడా…అని కేటీఆర్ ప్రశ్నించాడు. ఎప్పుడు ఇండియాలో ఎప్పుడు విదేశాల్లో ఉంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. మమ్మీ అధ్యక్షురాలు… ఈ డమ్మీ ఎవరో తెలియదని రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఏ హోదాలో డిక్లరేషన్ ప్రకటించారో తెలియదని… ఇది టెన్ జన్ పథ్ కాదని అన్నారు. మీ కాంగ్రెస్ నేతల సొల్లు పురాణానికి తలలు ఊపే వారు తెలంగాణలో లేరని అన్నారు. రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాడని… అయితే ఇప్పటికే పది ఛాన్సులు ఇచ్చారని అన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్లు అధికారాన్ని అప్పచెప్పారని…దేశంలో కరెంట్ ఇవ్వలేని, నీళ్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాహుల్ గాంధీ దివాలాకోరు మాటలు మాట్లాడారని విమర్శించారు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిదో తెలియదా… 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ ప్రధాన మంత్రి అని… మమ్మీ గారి చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంచుకొని ప్రధాని మన్మోహన్ సింగ్ ను బొమ్మగా ఆడించింది మీరు కాదా..? అని ప్రశ్నించారు.
మమ్మీ గారు అధ్యక్షురాలు…. రాహుల్ గాంధీ డమ్మీ: కేటీఆర్
-