పల్లె బస్సులు కాదు.. ఇక నుంచి.. ఎలక్ట్రిక్ బస్సులు

-

రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో టీఎస్ ఆర్టీసీపై మరింత భారం పడుతోంది.. దీంతో ఎలక్ట్రిక్ బస్సులు నడిపే దిశగా టీఎస్ ఆర్టీసీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నగరాలకు, పట్టణాలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు గ్రామాలకు కూడా నడిపేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్లాన్​ సిద్ధం చేస్తున్నట్లు టీఎస్​ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆదివారం ఆయన వికారాబాద్​ జిల్లాలోని పరిగి డిపోను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

పరిగి డిపో లాభాల్లో నడుస్తోందని కార్మికులు బాగా కృషి చేసి ఇంకా లాభసాటిగా నడపాలని అభినందించారు సజ్జనార్. పరిగి డిపో బస్సులకు కర్ణాటక డిజిల్ వినియోగిస్తున్నట్లు డిపో డీఎం పవిత్ర చెప్పగా, మన రాష్ట్రం నుంచే వాడాలని సూచించారు సజ్జనార్. రాష్ట్రవ్యాప్తంగా 1,016 బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు, పరిగి డిపోకు కూడా కొత్త బస్సులు ఇచ్చే అవకాశం ఉందన్నారు సజ్జనార్. పరిగి డిపో కర్ణాటక రాష్ట్రం సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో ఆర్టీసీ సంబంధాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని, ఏ కార్మికుడిని వీఆర్ఎస్ తీసుకోవాలని బలవంతం చేయలేదని సజ్జనార్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news