Big Boss Non Stop: మాటలతో మనసు దోచుకున్న అరియానా..టాప్ ఫైవ్ గ్యారెంటీ!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ గేమ్ పదకొండో వారంలోకి ఎంటరయింది. పదో వారం ఇంటి నుంచి అషురెడ్డి ఎలిమినేట్ అయింది. కాగా, ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనే విషయమై సోషల్ మీడియాలో ఫుల్ డిస్కషన్ జరిగింది. ఎట్టకేలకు అషురెడ్డి ఎలిమినేట్ అయింది.

ఎలిమనేషన్ సందర్భంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన డిస్కషన్ లో అరియానా మాట్లాడిన మాటలు బీబీ లవర్స్ తో పాటు కంటెస్టెంట్స్ అందరికీ బాగా నచ్చాయని చెప్పొచ్చు. ఆ మాటలతో అరియానా గ్లోరీ తన పట్ల పాజిటివిటీ ఏర్పరుచుకుంది.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించుకున్న బాబా భాస్కర్ మాస్టర్ దగ్గరి నుంచి అవసరమైతే పాస్ అడగొచ్చిని నాగార్జున సూచించాడు. ఒక నిమిషం టైమ్ ఇస్తున్నానని అషురెడ్డి, అరియానా..ఇద్దరిలో ఎవరో ఒకరు పాస్ కోసం అడగొచ్చని ‘బిగ్ బాస్’ హోస్ట్ కింగ్ నాగార్జున చెప్పాడు. ఆ సందర్భంలో అరియానా పాస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందేమోనని అందరు అనుకున్నారు. కానీ, అరియానా చాలా భిన్నంగా వ్యవహరించాడు.

బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించుకోవడం అనేది ఆయన కష్టమని, తన ప్లేస్ తాను ఉంటే డెఫినెట్ గా పాస్ ఎవరికి ఇచ్చేదానని కాదని, కాబట్టి ఇప్పుడు పాస్ అడగబోనని స్పష్టం చేసింది. అరియానా గ్లోరి మాటలకు బాబా భాస్కర్ మాస్టర్ తో పాటు కంటెస్టెంట్స్ బీబీ లవర్స్ ఫిదా అయిపోయారు. అరియానా మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

https://www.instagram.com/reel/CdTW_zRgWtt/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news