కొత్త బ్రిడ్జ్ తో అద్బుతం.. ఇంజనీర్ ఆలోచన భళా..

-

కొత్త వాటిని నిర్మించడం ఇంజనీర్ పని..అందరు నిర్మిస్తారు.కానీ, అందరి దృష్టిని ఆకర్షించేలా ఆకట్టుకోవడం చేయడం చాలా తక్కువ.అలాంటి అరుదైన ఘనతను ఓ ఇంజనీర్ అందుకున్నాడు.. ఇప్పుడు అందరి దృష్టి అతని మీద పడింది.సరి కొత్తగా ఆలొచించి బ్రిడ్జ్ ను నిర్మించడానికి అతను చాలా కష్ట పడ్డారట.. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తుంది.ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన కొత్త పంబన్ బ్రిడ్జిని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ గా మారాయి. ఈ బ్రిడ్జికి సంబందించిన పనులను రైల్వే మినిస్ట్రీ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు తరచూగా షేర్ చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలోనే బ్రిడ్జికి సంబంధించిన ఒక సరికొత్త వీడియోని సోషల్ మీడియా లో షేర్ చేశారు.ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చెస్తుంది.. ఇది బంగాళాఖాతంలోని పాంబన్ ద్వీపాన్ని, భారతదేశ ప్రధాన భూభాగాన్ని పాత పాంబన్ బ్రిడ్జ్ కలుపుతుంది. నిజానికి ఈ బ్రిడ్జి కొన్ని వంద సంవత్సరాల క్రితం నిర్మించబడింది కావున ఈ బ్రిడ్జి ఇప్పుడు బాగా పాతబడిపోయింది. అందుకే పాత బ్రిడ్జి స్థానంలో కొత్త పాంబన్ బ్రిడ్జిని నిర్మించాలని 2019లోనె రైల్వేశాఖ అనుకుంది.అందుకోసం 280 కోట్లను కూడా కేటాయించారు.

రామేశ్వరం, ధనుష్కోడికి ఆధ్యాత్మిక యాత్రను చేయాలనుకునే యాత్రికులు, భక్తులకు ఈ కొత్త బ్రిడ్జి ఒక మార్గాన్ని చూపిస్తుందనే చెప్పొచ్చు. ఈసారి కొత్త పంబన్ బ్రిడ్జిని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు ఉన్న ఓల్డ్ పంబన్ రైల్వే బ్రిడ్జికి పక్కనే ఈ కొత్త బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. 2.07 కి.మీ పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జికి మరో ప్రత్యేకత కూడా ఉందని చెబుతున్నారు.. ఈ కొత్త పంబన్ బ్రిడ్జి యొక్క మధ్య భాగం పైకి కూడా లేస్తుందట..ఓడలు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సెన్సార్ తో ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం అందరినీ ఆకర్షిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news