కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిన్న హైదరాబాద్ నగరంలో తుక్కుగుడా బహిరంగ సభ తో కేసీఆర్ కు, కొడుకు కు నిద్ర పట్టడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీళ్లు,నిధులు,నియామకాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, కేటీఆర్ ఒక పిచ్చి కుక్క.. అమెరికాలో బ్రతుకు దేరువు కోసం ఉద్యోగం చేశాడంటూ ఆమె ధ్వజమెత్తారు. కేటీఆర్ అహంకారం తో మాట్లాడున్నాడని, కేటీఆర్ సిగ్గు పడాలి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధానిని ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతావా… ఎవరు లేకుండా మీరు ప్రజల మధ్యలకు రండి… నిన్న ప్రజా సంగ్రామ యాత్రలో అమిత్ షా నూటికి నూరు శాతం కరెక్ట్ మాట్లాడారని ఆమె స్పష్టం చేశారు.
అమిత్ షా కాలి గోటికి కూడా మీరు సరిపోరు.. కేటీఆర్ కుటుంబం అవినీతి కుటుంబం… అధికారం చూసి విర్ర విగుతున్నారు… మీ అయ్యా పాస్ పోర్ట్ ల బ్రోకరు అని మార్చి పోయావా… కేటీఆర్ మీరు ఎంత మీ బ్రతుకు ఎంత అంటూ ఆమె నిప్పులు చెరిగారు. కృష్ణా జలాశయాల్లో 570 టీఎంసీలు రావాల్సి వస్తే ఏ ఎందుకు 299 టీఎంసీలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ ను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. మీకు దమ్ముంటే పోలీస్ లేకుండా ఊర్లో తిరుగండి అంటూ ఆమె సవాల్ విసిరారు.