టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్గా ఉన్న ప్రణీత కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. పెద్ద హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయన్ల రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉంది ఈ భామకు.
ఆమె అందానికి ఫిదా కాని వారే ఉండరు. ఏం పిల్లో.. ఏం పిల్లడో ఎంట్రీ ఇచ్చి.. పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. ఇక ఈ మధ్య కాలంలో.. టాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు లేక.. తమిళ సినిమాలపై ఫోకస్ చేస్తోంది.
కొన్ని రోజుల కిందట తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించింది ఈ బ్యూటీ.
సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ ఫోటోను షేర్ చేసి.. ఈ విషయాన్ని చెప్పింది హీరోయిన్ ప్రణీత.
అయితే.. తాజాగా హీరోయిన్ ప్రణీత… సీమాంతం కార్యక్రమం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎల్లో సారీలో.. హీరోయిన్ ప్రణీత కనిపించి అందరినీ కనివిందు చేసింది.