పెళ్లికి సిద్ధంగా ఉన్నారా? ఈ 4 విషయాలు మీ భాగస్వామిని అడగటం మర్చిపోకండి..!

-

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు..అందుకే కోరుకున్న వ్యక్తిని కట్టుకోలేకపోతే..రాశిలేదు అనుకోవాలి అని అందరూ చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలు చాలావరకూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ఇంట్లో వాళ్ల ఫోర్స్ వల్ల చేసుకుంటున్నారు. లవ్ మార్యేజ్ లో అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా..ఆ ఇద్దరి మధ్య పరస్పరం గౌరవం ఉండాలి, ప్రేమ ముఖ్యంగా ఉండాలి. అప్పుడే వారి మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది.

ముఖ్యంగా దాపరికాలకు తావు ఇవ్వకూడదు. పెళ్లైన ఏడాదివరకూ అంతా బానే ఉంటుంది. కానీ మీ మధ్య దాపరికాలు ఎక్కువ అవుతుంటే..దూరం కూడా పెరుగుతూ పోతుంది. ఇదంతా కాదు..మీరు పెళ్లికి సిద్దమైతే..మీ భాగస్వామిని పెళ్లికి ముందే కొన్ని విషయాలు గురించి కచ్చితంగా అడగాలి. వారితో ఈ విషయాలు చర్చించటం మీ దాంపత్య జీవితానికి ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక సమస్య..

ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. మీరు చేసుకోబోయే వ్యక్తికి ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేదా ఎవరి దగ్గర నుంచైనా అప్పుగా తీసుకున్నారా..ఉంటే ఎంత ఎమౌంట్ ఉంది. ఎన్ని సంవత్సరాలు కట్టాలి. ఇదంతా మీరు తెలుసుకోని ఉండాలి. ఒకరికొకరు ఆదాయం, ఇంటి ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు ప్రణాళిక, ఆస్తి కోసం సరైన ఆలోచనలకు సంబంధించిన లెక్కలు చర్చించుకోవాలి. పైపై మెరుపులు చూసి పెళ్లి చేసుకుంటే..ఒకవేళ ఆ వ్యక్తికి అప్పులుకుంపటి ఉంటే..అందులో మీరు ఇరుక్కున్న వాళ్లు అవుతారు.

ఉపాధి..

ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కఠినంగా ఉన్నా తప్పులేదు. మీరు చేసుకునే వ్యక్తికి శాలరీ ఎంత అనే విషయం మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఈరోజుల్లో చాలామంది వచ్చేది ఒక శాలరీ అయితే..పెళ్లిళ్లలో చెప్పేది మరో శాలరీ. ఎక్కవ డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. తీరా పెళ్లి అయిపోయాక అసలు విషయం బయటపడి లబోదిబోమంటున్నారు. కాబట్టి మీ జీవితభాగస్వామికి ముఖ్యంగా అబ్బాయిలకు వచ్చే శాలరీ విషయంలో క్లిష్టర్ క్లియర్ గా ఉండాలి. అవసరమైతే పేస్లిప్స్ అడిగినా తప్పులేదు. సమాజంలో నమ్మకం లేదు. కాబట్టి మీరు అమాయకంగా నమ్మి మోసపోకండి.

పెళ్లి తరువాత ఉండే ఇళ్లు.

ఈ విషయంలో అమ్మాయిలు చాలా వరకూ పెళ్లైయ్యాక వేరే ఇళ్లు తీసుకుందాం, ఇద్దరమే ఉందాం అంటుంటారు. వాళ్ల బాధ వాళ్లది. అత్తగారితో ఉంటే ఎక్కడ టార్చర్ చేస్తారో అని భయం. కానీ మీరు ఒకవేళ కొత్త ఇంటికి మారుతున్నట్లు అయితే, లేదా అత్తగారితో ఇల్లు పంచుకుంటున్నారా చర్చించుకోవాలి. మీ భాగస్వామి కోసం లోతుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి. చాలా మంది వ్యక్తులు గోప్యతను కోరుకుంటారు. కొత్త ఇంటికి మారాలనుకోవచ్చు, మరికొందరు కుటుంబంతో సమయాన్ని ఆస్వాదించాలనుకోవచ్చు. దానికోసం పోరాడే బదులు ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

పిల్లలు..

పిల్లల విషయం మాట్లాడుకోవాలి.. మీరు పిల్లల్ని పొందాలనుకుంటున్నారా? లేదా ? అని మాట్లాడుకోవాలి. అంటే కొంతమంది పెళ్లైన వెంటనే పిల్లలు వద్దనుకుంటారు. కొన్ని సంవత్సరాలు ఆగుదాం అనుకుంటారు. ఈ నిర్ణయం మీ ఇద్దరికి ఇష్టమైతే…ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లకు ఎలాంటి భద్రత కల్పిస్తామో సరిగ్గా చర్చించుకోవాలి

ఈ విషయాలను మీరు పెళ్లికి ముందు చర్చించుకుంటే..ఇక మీ సంసార జీవితంలో ఎలాంటి గొడవలు రావనికాదు.. చెప్పలేం. కాకపోతే..ఒక క్లారిటీ ఉంటుంది అంతే. భార్యభర్తల మధ్య నమ్మకం, ప్రేమ ఒకరిమీద ఒకరికి గౌరవం, విలువ ఉండాలి, ఎప్పుడూ మీ మాటే నెగ్గాలి అనుకుంటే..గొడవలు పెరుగుతాయి. మీ భాగస్వామి మాటకు గౌరవం ఇవ్వాలి. అనుమానానికి తావివ్వకూడదు. చిన్న చిన్న విషయాలను బూతద్దంలో పెట్టి చూడడం మానేయండి. ఈరోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటున్నారు.. అలాగే అబ్బాయిలకు కూడా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి..వారి స్నేహాన్ని మీరు గౌరవించాలి. తప్పుగా చూస్తే అంతా తప్పుగానే కనిపిస్తుంది. అంతేకాదు..ఎవరికివారు ఫోన్లలో సమయాన్ని గడపకుండా..ఇంట్లో ఉన్నంత సేపు..మీ పాట్నర్ తో టైం స్పెండ్ చేయటానికి ట్రై చేయండి..ఇవన్నీ ఫ్యామిలి కౌన్సిలర్స్ ఇచ్చే బేసిక్ సజిషన్స్..మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అందించాం.

Read more RELATED
Recommended to you

Latest news